ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మూటలో మహిళ డెడ్ బాడీ మిస్టరీ వీడింది.
హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో రోడ్డు పక్కన మూటలో మహిళ డెడ్ బాడీ మిస్టరీ వీడింది. మహిళను హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవకి అనే మహిళ తనకు పుట్టిన కొడుకును రాములు దంపతులకు రూ. 1.50 లక్షలకు గతంలో విక్రయించింది. అయితే కొంతకాలంగా తనకు పుట్టిన బిడ్డను తిరిగి ఇచ్చేయాలని దేవకి రాములు దంపతులను కోరుతుంది.
ఈ విషయమై ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెంచుకుంటున్న కొడుకును దేవకికి ఇవ్వడం రాములు దంపతులకు ఇష్టం లేదు. దీంతో కొడుకు ను ఇస్తామని దేవకిని నమ్మించారు. ఈ నెల 1వ తేదీన దేవకిని తమ ఇంటికి రప్పించారు. కొడుకు విషయమై వీరి మధ్య గొడవ జరిగింది. దేవకిని రాములు దంపతులు చంపేశారు.
డెడ్ బాడీని మూట కట్టి దూరంగా వేసేందుకు వెళ్లారు. అయితే అదే సమయంలో పోలీస్ పెట్రొలింగ్ వాహనం వీరికి కన్పించింది. దీంతో భయపడి రోడ్డు పక్కనే ఆ మూటను వదిలేసి దపంతులు పారిపోయే ప్రయత్నం చేశారు.
also read:షాద్‌నగర్ లో దారుణం: రోడ్డు పక్కనే మూటలో మహిళ డెడ్ బాడీ
అయితే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. మహిళ డెడ్ బాడీని వదిలేసిన రాములు దంపతులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దేవకిని హత్య చేసిన విషయాన్ని రాములు దంపతులు పోలీసులకు చెప్పారు. దీంతో రాములు దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.