బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ.. కీలక సూచన చేసిన న్యాయస్థానం..

Published : Dec 19, 2022, 12:09 PM IST
బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ.. కీలక సూచన చేసిన న్యాయస్థానం..

సారాంశం

టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా(బీఆర్ఎస్) మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ టీపీసీసీ చీఫ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా(బీఆర్ఎస్) మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ టీపీసీసీ చీఫ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  రేవంత్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.  గులాబీ కూలీ పేరుతో ఎన్నికల అధికార నిబంధనలను ఉల్లంఘించి టీఆర్‌ఎస్ నేతలు పార్టీకి నిధులు వసూలు చేశారని రేవంత్ రెడ్డి గతంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారణ జరపాలని ఢిల్లి హైకోర్టు అప్పట్లోనే లేఖ పంపింది. అయితే ఇటీవల టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం.. అందుకు ఈసీ అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే తన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉండగానే.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టులో రేవంత్ రెడ్డి అదనపు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. అభ్యంతరాలు ఉన్న శాఖలపై ప్రత్యేక పిటిషన్‌లు వేసుకోవాలని సూచించింది. మరో పిటిషన్ వేసుకునేందుకు రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించింది. 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu