ఢిల్లీ అమ్మాయిపై వారం పాటు హనుమకొండలో అత్యాచారం

By telugu team  |  First Published Jan 27, 2021, 7:02 AM IST

ఢిల్లీలోని బాలికను ఓ యువకుడు తెలంగాణలోని హనుమకొండకు రప్పించాడు. ఆమెపై అతను వారంపాటు అత్యాచారం చేశాడు. చివరకు పోలీసులు అతన్ని పట్టుకున్నారు.


వరంగల్: ఢిల్లీ అమ్మాయిపై ఓ యువకుడు తెలంగాణలోని హనుమకొండలో వారం రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన 16 ఏళ్ల బాలికను నూనె మురళీకృష్ణ హనుమకొండకు రప్పించాడు. రెండు నెలల క్రితం ఆమెను హనుమకొండకు పిలిపించాడు.

ఆ తర్వాత వారం రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశాడు. కూతురు కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఢిల్లీలోని రాణిగంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాణిగంజ్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Latest Videos

బాలిక ఫోన్ కు హనుమకొండలోని మురళీకృష్ణకు తరుచుగా కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసును ఢిల్లీ పోలీసులు హనుమకొండకు మార్చారు. బాలిక తల్లిదండ్రులు ఈ నెల 14వ తేదీన హనుమకొండకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దాంతో మురళీకృష్ణ  బాలికతో మురళీకృష్ణ పారిపోయాడు. తమిళనాడులోని ముదరైలో ఉండగా వారిద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడపై అత్యాచారం కేసు నమోదు చేసి అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. 

click me!