కడిగిన ముత్యంలా బయటకు వస్తా: కల్వకుంట్ల కవిత

By narsimha lode  |  First Published Mar 26, 2024, 12:35 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కస్టడీ ముగియడంతో  కవితను ఇవాళ కోర్టులో హాజరుపర్చారు.


న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విశ్వాసం వ్యక్తం చేశారు. కస్టడీ ముగియడంతో  మంగళవారంనాడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో  కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు.

కోర్టు హాల్ లోకి వెళ్లే సమయంలో  ఆమె మాట్లాడారు.ఇది మనీలాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ ఆరోపించారు.  ఈ కేసు నుండి క్లీన్ గా బయటకు వస్తానని ధీమాను వ్యక్తం చేశారు. తనపై తప్పుడు కేసు బనాయించారని ఆమె ఆరోపించారు. ఈ కేసుతో తనను తాత్కాలికంగా జైల్లో పెట్టారన్నారు. అయినా తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని  కవిత చెప్పారు.తాను అఫ్రూవర్ గా మారేది లేదన్నారు.  

Latest Videos

undefined

ఇప్పటికే ఓ నిందితుడు బీజేపీలో చేరారన్నారు.మరొకరు బీజేపీ టిక్కెట్టు పొందారని కవిత ఆరోపించారు.  మరోకరు  ఎలక్టోరల్ బాండ్ల రూపంలో  రూ. 50 కోట్లు ఇచ్చారని  కవిత ఆరోపణలు చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కడిగిన ముత్యంలా బయటకు వస్తానని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విశ్వాసం వ్యక్తం చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ఈ నెల  15న అరెస్ట్ చేశారు. పది రోజుల పాటు ఈడీ అధికారుల కస్టడీలో  కవిత ఉన్నారు.కస్టడీ ముగియడంతో  ఇవాళ కోర్టులో కవితను ఈడీ అధికారులు హాజరుపర్చారు.  కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.మరో వైపు కవితను కస్టడీకి ఇవ్వాలని  ఈడీ తరపు న్యాయవాదులు కోరారు.
 

click me!