వివాహేతర సంబంధం కోసం వెంపర్లాట.. చివరకు

Published : Jan 04, 2019, 10:38 AM IST
వివాహేతర సంబంధం కోసం వెంపర్లాట.. చివరకు

సారాంశం

పరాయి వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వెంపర్లాడి.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు.

పరాయి వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వెంపర్లాడి.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తిరుమలాయపాలెంలోని బాలాజీనగర్ తండాకి చెందిన నూనావత్‌ కస్నా-సుహాలీ దంపతుల కుమారుడు హరీష్‌(19), డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థి. ఇదే తండాకు చెందిన మాలోతు చంటి భార్య సునితతో హరీష్‌ గత కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటూ హరీష్.. సునీతను గత కొంతకాలంగా వేధిస్తూనే ఉన్నాడు.

ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగాయి. అయినా.. హరీష్ మాత్రం తన తీరు మార్చుకోలేదు.  ఇదిలా ఉండగా.. గురువారం పని చేసుకునేందుకు సునీత పొలానికి వెళ్లగా.. అక్కడికి కూడా హరీష్ వచ్చి.. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అది చూసి తట్టుకోలేకపోయిన సునీత భర్త చంటి.. హరీష్ పై దాడికి దిగాడు.

పంట పొలాల వద్ద ఉన్న రాళ్లతో కొట్టి మరీ హరీష్ ని దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్యతో సహా గ్రామానికి వెళ్లి.. హరీష్ ని చంపినట్లు తెలిపాడు. తనంతట తానే పోలీసు స్టేషన్ కి వెళ్లి తానే హత్య చేసినట్లు చెప్పి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?