ఫోటో ల్యాబ్ ఏర్పాటు కోసం నకిలీ నోట్ల తయారీ: హైద్రాబాద్‌లో ఐదుగురు ఫేక్ కరెన్సీ ముఠా అరెస్ట్

By narsimha lodeFirst Published Aug 19, 2021, 3:36 PM IST
Highlights


నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు హైద్రాబాద్ పోలీసులు. చుక్కాపురం సంతోష్ కుమార్ ఈ ముఠా ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ వివరించారు.
 

హైదరాబాద్:  నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా  హైద్రాబాద్‌ సీపీ అంజనీకుమార్ చెప్పారు.గురువారం నాడు హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడారు.  ఈ ముఠాలో ప్రధాన నిందితుడు చుక్కాపురం సంతోష్ కుమార్ అని ఆయన చెప్పారు. సంతోష్ కు సాయికుమార్ జత కలిశాడన్నారు. వీరికి నీరజ్ కుమార్, జలగం రాజులు ల్యాప్‌టాప్‌లు, ఇతర సామాగ్రిని ఇచ్చారని సీపీ తెలిపారు.

ఎంబీఏ పూర్తి చేసిన సంతోష్ కుమార్ ఫోటోగ్రాఫర్ గా స్థిరపడాలనుకొన్నాడన్నారు. అయితే  ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ఆయన వద్ద డబ్బు లేదు. అయితే అదే సమయంలో  సంతోష్ కుమార్ కు సాయికుమార్ జత కలిశాడని సీపీ చెప్పారు. సాయికుమార్ కు అప్పులున్నాయని, వీటిని తీర్చేందుకు  ఏం చేయాలనే విషయమై ఆలోచించాడన్నారు.

నకిలీ కరెన్సీని ప్రింట్ చేయాలని భావించారన్నారు. ఈ ఇద్దరికి నీరజ్ కుమార్, జలగం రాజులు టెక్నకల్ మద్దతును ఇచ్చారని సీపీ తెలిపారు. అచ్చు నిజమైన కరెన్సీ మాదిరిగానే కరెన్సీని తయారు చేశారన్నారు.  కచ్చితమైన సమాచారం మేరకు ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసు చేధించడానికి కృషి చేసిన పోలీసు అధికారులను సీపీ అంజనీకుమార్  అభినందించారు.

click me!