కరోనా ఎఫెక్ట్: డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

By narsimha lodeFirst Published Mar 24, 2021, 4:44 PM IST
Highlights

తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఉన్నత విద్యామండలి ప్రకటించింది.త్వరలోనే రీ షెడ్యూల్ ను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది.
 


హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఉన్నత విద్యామండలి ప్రకటించింది.త్వరలోనే రీ షెడ్యూల్ ను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నెల 24వ తేదీ నుండి విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేసింది.దీంతో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశారు. విద్యా సంస్థల బంద్ తో పరీక్షలు వాయిదా వేసినట్టుగా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో గత ఏడాది కూడ ఆలస్యంగా పరీక్షలు పరిగాయి. దాని ప్రభావం ఈ ఏడాది పరీక్షలపై కూడ పడింది. ఈ ఏడాది సకాలంలో పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే మరోసారి కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకొంటూనే మరోవైపు వ్యాక్నిసేషన్ ను మరింత వేగవంతం  చేసింది ప్రభుత్వం.

click me!