తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఇంచార్జీలు: దీపాదాస్ మున్షి

By narsimha lodeFirst Published Apr 1, 2024, 11:17 AM IST
Highlights

తెలంగాణలోని  17 పార్లమెంట్ స్థానాలకు  కాంగ్రెస్ పార్టీ  ఇంచార్జీలను నియమించింది.

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలోని  17 పార్లమెంట్ స్థానాల్లో  మెజారిటీ స్థానాల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్దం చేస్తుంది.ఈ క్రమంలోనే  17 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీలను నియమించింది.   ఈ మేరకు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి ఇంచార్జీల పేర్లను  మీడియాకు విడుదల చేశారు.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా  కాంగ్రెస్ ఇంచార్జీలు

1.పెద్దపల్లి-శ్రీధర్ బాబు
2.హైదరాబాద్-ఒబేదుల్లా కొత్వాల్
3.ఆదిలాబాద్-సీతక్క
4. చేవేళ్ల-వేంనరేందర్ రెడ్డి
5.జహీరాబాద్- దామోదర రాజనర్సింహ
6.మెదక్-కొండా సురేఖ
7.మల్కాజిగిరి-మైనంపల్లి హనుమంతరావు
8.సికింద్రాబాద్-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
9.కరీంనగర్-పొన్నం ప్రభాకర్
10.నిజామాబాద్-సుదర్శన్ రెడ్డి
11. నల్గొండ-ఉత్తమ్ కుమార్ రెడ్డి
12. భువనగిరి-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
13. వరంగల్-రేవూరి ప్రకాష్ రెడ్డి
14. ఖమ్మం-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
15.నాగర్ కర్నూల్-జూపల్లి కృష్ణారావు
16.మహబూబాబాద్-తుమ్మల నాగేశ్వరరావు
17.మహబూబ్ నగర్-సంపత్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలోని  17 ఎంపీ స్థానాల్లో  కనీసం  14 స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ దిశగా ఆ పార్టీ వ్యూహరచన చేస్తుంది. ఈ క్రమంలోనే  ఇతర పార్టీల్లోని కీలక నేతలను కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది.  బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు  కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు కూడ  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడ  కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో  జీహెచ్ఎంసీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో  ఈ ప్రాంతంపై  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.  ఈ దిశగా  ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. 
 

click me!