తెలంగాణలో భానుడి భగభగలు: వడగాలులు, రాత్రిపూట పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

By narsimha lode  |  First Published Apr 1, 2024, 10:11 AM IST


రానున్న ఐదు రోజుల పాటు  తెలంగాణలోని పలు జిల్లాల్లో  ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. పగలే కాదు రాత్రి పూట కూడ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుంది.  ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ , పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాత్రిపూట కూడ  ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.

Latest Videos

undefined

కామారెడ్డి, కరీంనగర్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో  వేడిగాలులు వీచే  అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ నెల  1 నుండి 3వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. రాగల నాలుగైదు రోజుల పాటు 44 నుండి  45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

రాష్ట్రంలోని  33 జిల్లాల్లో  40 డిగ్రీల సెల్సియస్ దాటినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.  రాష్ట్రంలో అత్యధికంగా  నల్గొండలో  43.10 డిగ్రీలు, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాల్లో  43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.జీహెచ్ఎంసీ పరిధిలోని కాప్రాలో  41.50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ లో   26.50 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.


 

click me!