దీక్షిత్ కిడ్నాప్ కేసు: అన్ని పనులు డింగ్‌టాక్ యాప్‌తోనే.. నిందితుడి ప్లాన్ ఇదే..!!

By Siva KodatiFirst Published Oct 23, 2020, 3:51 PM IST
Highlights

మహబూబాబాద్‌లో 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

మహబూబాబాద్‌లో 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మందసాగర్ ఏడాది నుంచి డింగ్ టాక్ యాప్‌‌ను వాడుతున్న నిందితుడు మందసాగర్ ఆ యాప్ ద్వారానే దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు.

తన గర్ల్‌ఫ్రెండ్‌కు కూడా నిందితుడు ఈ యాప్ ద్వారానే ఫోన్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. పెట్రోల్ బంకుకు వెళ్దామనే దీక్షిత్‌ను బండిపై ఎక్కించుకున్నాడు ప్రేమ్ సాగర్. తెలిసిన వ్యక్తే కావడంతో దీక్షిత్ రెడ్డి అతని బండెక్కాడు.

మధ్యలో మంచినీటిలో నిద్రమాత్రలు కలిపి బాలుడితో తాగించాడు. చిన్నారికి స్పృహ వచ్చేలోపే హత్య చేశాడు సాగర్. ఆ తర్వాత డింగ్‌టాక్ యాప్ ద్వారా దీక్షిత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు.

Also Read:పక్కా స్కెచ్‌తోనే దీక్షిత్ హత్య, ఆర్ఎంపీ వద్ద నిద్రమాత్రలు: ఎస్పీ కోటిరెడ్డి

ఫోన్ ద్వారా కాకుండా యాప్‌తో ఫోన్ చేయడంతో అతనిని పట్టుకోవడం పోలీసులకు కొంత ఆలస్యమైంది. జరుగుతున్న పరిణామాలన్నింటిని సాగర్ దగ్గరుండి గమనించాడు. దీక్షిత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లి పరిస్థితులను కనుక్కునేవాడు.

పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారని తెలుసుకునే దీక్షిత్ రెడ్డి తండ్రి తెచ్చిన డబ్బును తీసుకునేందుకు కూడా ముందుకు రాలేదు. బాలుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం కంటే ముందే దీక్షిత్‌ను సాగర్ హత్య చేశాడు.

ఓ చౌరస్తా దగ్గరకు దీక్షిత్ తండ్రిని రమ్మని చెప్పి షాపులోంచి గమనించాడు సాగర్. పోలీసులు ఫాలో అవుతున్నారనే అనుమానంతో... మళ్లీ ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. హత్య చేసిన తర్వాత తల్లిదండ్రుల రియాక్షన్ గమనించేందుకు దీక్షిత్ ఇంటికి వెళ్లాడు సాగర్. 

click me!