రేవంత్ ను ఓడించేందుకు అంత పని చేసాారా..? పరారీలో మాజీ డిప్యూటీ మేయర్, పోలీసుల గాలింపు 

By Arun Kumar P  |  First Published Dec 20, 2023, 12:11 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదయిన ఓ కేసులో హైదరాబాద్ మాజీ మేయర్, బోరబండ కార్పోరేటర్ బాబా ఫసియుద్దిన్ ను అదుపులో తీసుకునేందుకు కొడంగల్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  


కొడంగల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్, బిఆర్ఎస్ నేత బాబా ఫసియుద్దిన్ పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదయ్యింది. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీచేసిన కొడంగల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థికి పట్నం నరేందర్ రెడ్డికి మద్దతుగా ఫసియుద్దిన్ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ నాయకులు తనపై దాడి చేసారని నరేష్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి.  

 కొడంగల్ బిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడు హితేష్ రెడ్డి, హైదరాబాద్ కార్పోరేటర్ ఫసియుద్దిన్ లతో సహా ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కోస్గి పోలీసులు ఫసియుద్దిన్ కోసం గాలిస్తున్నారు. హత్యాయత్నంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదైన నేపథ్యంలో విచారించేందుకే ఫసియుద్దిన్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Videos

Also Read  కేసీఆర్ పేరును తొలగించి తన పేరు ... అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

బోరబండ కార్పోరేటర్ ఫసియుద్దిన్ తో పాటు సహా ఆరుగురిపై 307, 147, 148,341, 171ఎఫ్, 504, 506R/W, 149 ఐపిస సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన కోసం బోరబండ పోలీసుల సాయంతో కోస్గి పోలీసులు గాలింపు చేపట్టారు. రెండు రోజులుగా ఫసీయుద్దిన్ పరారీలో వున్నట్లు... ఆయన కోసం బోరబండలో వెతుకులాట కొనసాగుతోంది. ఎక్కడ దాక్కున్నా ఆఛూకీ తెలుసుకుని ఫసియుద్దిన్ ను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

అసలేం జరిగింది : 

గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించేందుకు బిఆర్ఎస్ విశ్వప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలనే కాదు రేవంత్ కు మద్దతిచ్చే వారిని బిఆర్ఎస్ బెదిరించింది. ఇలా స్థానికంగా డెకరేషన్ ఏజన్సీ నిర్వహించే నరేష్ కూడా రేవంత్ కు మద్దతివ్వడంతో అతడిపై బిఆర్ఎస్ నేతలు దాడి చేసారు.  

పనులు ముగించుకుని అర్ధరాత్రి ఇంటికి వెళుతున్న నరేష్ ను బిఆర్ఎస్ నాయకులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు.  అతడి మెడలోని 3 తులాల బంగారు గొలుసు, జేబులోని సెల్ ఫోన్, రూ.20 వేల నగదును దోచుకున్నారట. దీంతో అతడు కోస్గి పోలీస్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు  చేయగా నరేందర్ రెడ్డి, ఫసియుద్దిన్ లతో పాటు మరికొందరిపై  కేసులు నమోదయ్యారు.ఈ కేసుల్లోనే తాజాగా ఫసియుద్దిన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

click me!