జమ్మికుంటలో కలకలం : రైలు ఇంజిన్ కు వేలాడుతూ మృతదేహం..ఎవరిదంటే..

Published : Jan 27, 2023, 06:45 AM IST
జమ్మికుంటలో కలకలం : రైలు ఇంజిన్ కు వేలాడుతూ మృతదేహం..ఎవరిదంటే..

సారాంశం

రైలు ఇంజిన్ కు మృతదేహం చిక్కుకున్న ఘటన జమ్మికుంటలో కలకలం రేపింది. జమ్ము వెడుతున్న రైలుకు ఓ వ్యక్తి చిక్కుకుని కనిపించడంతో ట్రైన్ గంటన్నర ఆలస్యంగా నడిచింది. 

కరీంనగర్ : కరీంనగర్ లో ఓ హృదయ విధాకర ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలు ఇంజిన్ కి ఓ మృతదేహం చిక్కుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. జమ్ము వెళ్తున్న అండమాన్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ కి ఓ మృతదేహం చిక్కుకుని కనిపించింది. రైలు జమ్మికుంట స్టేషన్ కి రాగానే రైలు నడుపుతున్న లోకో పైలట్ మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే రైలును ఆపేశాడు. మృతదేహాన్ని రైలు ఇంజిన్ నుంచి విడదీశారు.

మృతుడు 72 సంవత్సరాల ఉప్పలయ్యగా గుర్తించారు. అతను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రిటైర్డ్ ఎంప్లాయ్. హనుమకొండ నయీమ్ నగర్ లో ఉంటాడు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని ఆత్మహత్య అని తెలుస్తోంది. మృతుడి జేబులో  సూసైడ్ లెటర్ దొరికింది. తన చావుకు తానే కారణమని  లెటర్ లో రాసి  ఉందని అధికారులు వెల్లడించారు. 

వెలుగులోకి జయ ఇన్‌ఫ్రా అక్రమాలు : 50 ప్రాజెక్ట్‌లు, సెలబ్రెటీలతో ఓపెనింగ్స్.. 100 కోట్లు టోకరా

విశ్రాంత ఉద్యోగి అయిన ఉపలయ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గంటన్నర పాటు అండమాన్ ఎక్స్ప్రెస్ జమ్మికుంట స్టేషన్లో ఆగిపోయింది.  మృతదేహాన్ని ఇంజన్ నుంచి వేరుచేసి.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించి..  ఇంజన్ను పరీక్షించిన తర్వాత అధికారులు  రైలును తిరిగి  పంపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?