26న దసరా సెలవు: ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Published : Oct 23, 2020, 07:30 PM ISTUpdated : Oct 23, 2020, 07:31 PM IST
26న దసరా సెలవు: ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

సారాంశం

దసరా పండుగ సెలవుపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దసరా పర్వదినం అదివారమా, సోమవారమా అనే సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఆ స్పష్టత ఇచ్చింది.

హైదరాబాద్: దసరా పర్వదినం సెలవుపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దసరా ఈ నెల 25వ తేదీననా, 26వ తేదీననా అనే వివాదం నెలకొన్న నేపథ్యంలో క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత సెలవు దినాన్ని మార్చింది. 

ఇంతకు ముందు ఈ నెల 25వ తేదీన దసరా సెలవు దినంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత విజయ దశమి సెలవు దినాన్ని 25వ తేదీ నుంచి 26వ తేదీకి మార్చినట్లు తాజా ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ మేరకు గెజెట్ లో ప్రకటించింది. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సద్దుల బతుకమ్మ శనివారం జరుగుతుంది. సద్దుల బతుకమ్మకు, దసరాకు మధ్య ఓ రోజు వ్యవధి ఉండడం సాధారణం.

సద్దుల బతుకమ్మ కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు రేపు శనివారం కూడా సెలవే. తెలంగాణలో బతుకమ్మకు విశేషమైన ప్రాచుర్యం ఉంది. 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బ్రేక్ చేస్తున్న ఎండలు AP Telangana Weather News| Asianet News Telugu
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 700 కోట్ల‌తో, 63 అంత‌స్థుల అపార్ట్‌మెంట్‌, ఒక్క ప్లాట్ ధ‌ర రూ. 6.2 కోట్లు