‘చివరి నిమిషం వరకు ఏం చేస్తున్నారు?’..పరీక్షల వాయిదాకు టీఎస్ హై కోర్టు నో...

Published : Jul 05, 2021, 12:41 PM IST
‘చివరి నిమిషం వరకు ఏం చేస్తున్నారు?’..పరీక్షల వాయిదాకు టీఎస్ హై కోర్టు నో...

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షల వాయిదా మీద హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడానికి ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రయత్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షల వాయిదా మీద హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడానికి ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రయత్నించారు. పిటిషన్ స్వీకరణకు అనుమతి కోరగా.. స్పందించిన హై కోర్టు పరీక్షల అంశాన్ని అత్యవసర విచారణకు నిరాకరించింది. 

చివరి నిమిషం వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పటికే పరీక్షలు ప్రారంభమైనందును జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా లంచ్ మోషన్ పిటిషన్ కు అనుమతి ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. 

మరోవైపు ఈ ఉదయం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటివద్ద డిగ్రీ, పీజీ విద్యార్థులు పరీక్షలను వాయిదా వేయాలని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ