కాంగ్రెసుకు షాక్: దానం నాగేందర్ రాజీనామా, కేసీఆర్ భారీ ఆఫర్

First Published Jun 22, 2018, 2:42 PM IST
Highlights

తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాదులో కాంగ్రెసు పార్టీకి షాక్ తగిలింది.

హైదరాబాద్: తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాదులో కాంగ్రెసు పార్టీకి షాక్ తగిలింది. పార్టీకి మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామా చేశారు. తన ప్రాథమిక సభ్యత్వానికి ఆయన శుక్రవారం రాజీనామా చేశారు.

తన రాజీనామా లేఖలను ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు. గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. 

దానం నాగేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానం నాగేందర్ గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

రేపు శనివారం దానం నాగేందర్ తన భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నుంచి దానం నాగేందర్ కు భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెసులో చాలా కాలంగా అసంతృప్తితో వేగిపోతున్న ఆయన ఇటీవల హైదరాబాద్ నగర కాంగ్రెసు అధ్యక్ష పదవిని అంజన్ కుమార్ యాదవ్ కు కట్టబెట్టడంతో మరింత రగిలిపోయినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ లోకసభ టికెట్ ఇస్తామని టీఆర్ఎస్ వర్గాలు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. 

click me!