గోషామహాల్ అభ్యర్థిగా దానం..త్వరలో అధికారిక ప్రకటన..?

By sivanagaprasad KodatiFirst Published 11, Sep 2018, 12:29 PM IST
Highlights

దానం నాగేందర్ అభిమానులకు శుభవార్త.. ఆయన్ను గోషామహాల్ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీని రద్దు చేసిన రోజు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో దానం పేరు కనిపించలేదు

దానం నాగేందర్ అభిమానులకు శుభవార్త.. ఆయన్ను గోషామహాల్ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీని రద్దు చేసిన రోజు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో దానం పేరు కనిపించలేదు.

దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని.. తిరిగి కాంగ్రెస్ గూటికే వెళ్తారని.. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విషయం కేసీఆర్ దాకా వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు తాను ఉత్తమ్‌ను కలవలేదని ఇదంతా కాంగ్రెస్ దుష్ప్రచారమని దానం ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలిపారు.

ఈ నేపథ్యంలో మిగిలిన 15 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో దానం పేరును పరిశీలించింది టీఆర్ఎస్. ఆయనకు గోషామహల్ టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన రాగా.. దానం మరో స్థానం కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 13న దానం అభ్యర్థిత్వంపై టీఆర్ఎస్ అధిష్టానం తుది నిర్ణయం ప్రకటించవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే.

Last Updated 19, Sep 2018, 9:22 AM IST