జీహెచ్‌ఎంసీకి కొత్త కమీషనర్‌: ముగ్గురు ఐఎఎస్‌లకు స్థానచలనం

Published : Aug 24, 2018, 06:08 PM ISTUpdated : Sep 09, 2018, 01:14 PM IST
జీహెచ్‌ఎంసీకి  కొత్త కమీషనర్‌: ముగ్గురు ఐఎఎస్‌లకు స్థానచలనం

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు కీలక ఐఎఎస్‌లు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు హైదరాబాద్ కమీషనర్ గా బాధ్యతలు నిర్వహించిన జనార్ధన్ రెడ్డి హెచ్ఎండిఏ కమీషనర్ గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో దానకిషోర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు కీలక ఐఎఎస్‌లు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు హైదరాబాద్ కమీషనర్ గా బాధ్యతలు నిర్వహించిన జనార్ధన్ రెడ్డి హెచ్ఎండిఏ కమీషనర్ గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో దానకిషోర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీహెచ్‌ఎంసి కమీషనర్ తో పాటు  జలమండలి ఎండీ, మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శిగా దానకిశోర్ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఇక ప్రస్తుత హెచ్ఎండీఏ  కమిషనర్ చిరంజీవులు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఆదేశాలు వెలువడ్డాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ రాజకీయంగా ప్రచారం జరుగుతున్న సమయంలో తాజాగా కీలక ఐఎఎస్ ల బదిలీ జరగడం చర్చనీయాంశంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ