దమ్మాయిగూడలో మరో బాలిక కిడ్నాప్ కు యత్నం... ! తల్లి గమనించడంతో...

Published : Jul 10, 2021, 11:15 AM IST
దమ్మాయిగూడలో మరో బాలిక కిడ్నాప్ కు యత్నం... ! తల్లి గమనించడంతో...

సారాంశం

వందలాది మంది పోలీసులు శుక్రవారం గాలిస్తున్న క్రమంలో ప్రగతినగర్ లో ఎరుపు రంగు టీ షర్ట్.. నల్లరంగు మాస్క్ ధరించిన ఓ అనుమానిత వ్యక్తి అక్కడే ఉన్న కిరాణ దుకాణంలో సిగరెట్ కొనుగోలు చేశాడు. అక్కడే ఆడుకుంటున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు.

మేడ్చల్ జిల్లా  దమ్మాయిగూడలో ఓ నాలుగేళ్ల చిన్నారిమీద గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు ఒరిస్సాకు చెందిన 40 యేళ్ల వ్యక్తిగా జవహర్ నగర్ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను బండ్ల గూడలో ఉంటున్నట్లు తెలిపారు. 

భార్యతో తరచూ గొడవల కారణంగా కొంతకాలం నుంచి భార్యతో దూరంగా ఉంటున్నాడని పేర్కొన్నారు. జవహర్ నగర్ సీఏ బిక్షపతి రావు, కీసర సీఐ నరేందర్ గౌడ్ జాయింట్ ఆపరేషన్ లో నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నట్లు పేర్కొన్నారు. 

తప్పించుకు తిరుగుతున్న నిందితుడి కోసం ఐదు రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. దీంతో శుక్రవారం రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలు దాదాపు 600మంది పోలీసులు ఉదయం నుంచి దమ్మాయిగూడ ప్రగతినగర్ తో పాటు సమీప అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆయా కాలనీల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. జవహర్‌నగర్‌ సీఐ భిక్షపతిరావు, కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ల నేతృత్వంలో విస్తృతంగా విచారణ చేపట్టారు.  

వందలాది మంది పోలీసులు శుక్రవారం గాలిస్తున్న క్రమంలో ప్రగతినగర్ లో ఎరుపు రంగు టీ షర్ట్.. నల్లరంగు మాస్క్ ధరించిన ఓ అనుమానిత వ్యక్తి అక్కడే ఉన్న కిరాణ దుకాణంలో సిగరెట్ కొనుగోలు చేశాడు. అక్కడే ఆడుకుంటున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. 

ఆమెను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన బాలిక తల్లి వెంటనే అప్రమత్తమవ్వడంతో అనుమానిత వ్యక్తిని నిలదీసింది. మహిళ, స్థానికులు నిలదీయడంతో అతడు అక్కడినుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్