
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ( వీహెచ్) డ్యూటీలో ఉన్న పోలీసును అసభ్య పదజాలంతో దూషించాడు.
ఈ రోజు అసెంబ్లీ బయట ఈ ఘటన చోటు చేసుకుంది.
శాసనసభలోని మీడియా పాయింట్ వద్ద వెళ్లేందుకు వీహెచ్ ప్రయత్నించగా అక్కడే డ్యూటీలో ఉన్న ఇన్సెపెక్టర్ సుధాకర్ ఆయనను అడ్డుకున్నారు.
దీంతో మనస్తాపానికి గురైన సుధాకర్ ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో ప్రస్తావిస్తూ.. ఎస్సీ అయినందుకే తనను వీహెచ్ కులం పేరుతో దూషించారని ఆరోపించారు.
తాను ఇక పోలీస్ డిపార్టుమెంటు నుండి వెళ్లిపోతానని, ఉద్యోగానికి రాజీనామా చేస్తానని పోస్టు చేశారు.
దూషణ పర్వాన్నిపోలీస్ అధికారులు దృష్టికి తీసుకెళ్లిన తనను ఎవరూ పట్టించుకువట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా డిపార్టుమెంటులోనే నాకు న్యాయం జరగడం లేదనని వాపోయారు.
20 ఏళ్ల తన సర్వీసులో ఎలాంటి ఆరోపణలు ఎదర్కోలేదని కానీ ఈ రోజు నా డ్యూటీ నేను చేసిన పాపానికి అవమానం తప్పలేదన్నారు.