మోదీ డ్రీమ్ ప్రాజెక్టులో తెలుగు కలెక్టర్

Published : Mar 24, 2017, 11:30 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
మోదీ డ్రీమ్ ప్రాజెక్టులో తెలుగు కలెక్టర్

సారాంశం

ఉత్తరప్రదేశ్ కేడర్ కలెక్టర్ చంద్రకళకు కీలక పదవి

aస్వచ్ఛ భారత్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు ఇది. దీని కోసం కేంద్ర భారీ స్థాయిలో నిధులు కూడా మంజూరు చేస్తోంది. ప్రజల నుంచి స్వచ్ఛ భారత్ టాక్స్ కూడా వసూలు చేస్తోంది.

 

ఎన్డీయే ప్రభుత్వ ప్రతిష్టాత్మకర ప్రాజెక్టు కావడంతో దీనికి సమర్థవంతమైన అధికారులను కేటాయిస్తుంది.

 

ఈ ప్రాజెక్టు అధికారుల్లో తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ కూడా చేరారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. మన తెలుగుమ్మాయే.. పేరు చంద్రకళ. తెలంగాణలోని కరీంగనర్ ఆమె స్వస్థలం.

 

ఉత్తరప్రదేశ్ కేడర్‌ కు చెందిన ఈ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మీరట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

 

ఆమె ప్రతిభ, పనితీరును గుర్తించి ప్రధాని మోదీ తన కలల ప్రాజెక్ట్ 'స్వచ్ఛ భారత్ మిషన్' డైరెక్టర్‌గా ఆమెను నియమించారు. అలాగే తాగునీరు, పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ సెక్రటరీగా కూడా ఆమె బాధ్యతలు నిర్వహిస్తారు.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?