Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన మౌచింగ్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో మోస్తారు నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని ఐఎండీ పేర్కొంది.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) అంచనాల ప్రకారం డిసెంబర్ 4 నుంచి 6 వరకు 'మిచాంగ్' తుఫాను తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. రాజధాని నగరంతో పాటు వివిధ జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది.
తెలంగాణకు తూర్పున ఉన్న ఒంగోలు-కోనసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంతకుముందు తెలిపింది. ప్రస్తుతం ఏపీలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడగా, అనేక ప్రాంతాల్లో మేఘాలతో కమ్ముకున్నాయి.
డిసెంబర్ 4 నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. డిసెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్ లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తఇదే సమయంలో రాష్ట్రంలో ఈదురు గాలులు, మేఘావృత వాతావరణం నెలకొనడంతో ఈ వారంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.
దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడులోని కోస్తా జిల్లాలు వచ్చే వారం ప్రారంభంలో మిచౌంగ్ తుఫాను భారీ ప్రభావానికి గురవుతుండగా, తెలంగాణ సంభావ్య అంతరాయాలకు సిద్ధమవుతోంది. సోమవారం తెల్లవారు జామున తూర్పు తీరాన్ని తుఫాను తాకే అవకాశం ఉంది. మరోవైపు తుఫాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే 142 రైళ్లను మరో 3-4 రోజుల పాటు రద్దు చేసింది.