
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (srinivas goud) హత్యకు గుర్తుతెలియని వ్యక్తులు కుట్రపన్నారు. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. పేట్ బషీరాబాద్‌లో నిందితులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ (cyberabad police commissioner) స్టీఫెన్ రవీంద్ర (stephen ravindra) వివరించనున్నారు. శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నారన్న వార్తలతో తెలంగాణ ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
మంత్రితో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్‌లను హత్య చేయించేందుకు ఈ కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫరూక్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఫరూక్ పేట్ బషీర్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుట్ర విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.