వైద్యురాలి పేరు వాడొద్దు... ఇకపై జస్టిస్ ఫర్ దిషాగా పిలవాలి: సీపీ సజ్జనార్

By sivanagaprasad Kodati  |  First Published Dec 1, 2019, 8:02 PM IST

మృగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన వైద్యురాలి పేరును సైబరాబాద్ పోలీసులు మార్చారు. ఆమెను ఇక నుంచి జస్టిస్ ఫర్ దిశా అనే పేరుతో పిలవాలని, అలాగే దిశా తల్లిదండ్రుల పేర్లు, ఫోటోలను ఎక్కడా ప్రదర్శించరాదని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.


మృగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన వైద్యురాలి పేరును సైబరాబాద్ పోలీసులు మార్చారు. ఆమెను ఇక నుంచి జస్టిస్ ఫర్ దిశా అనే పేరుతో పిలవాలని, అలాగే దిశా తల్లిదండ్రుల పేర్లు, ఫోటోలను ఎక్కడా ప్రదర్శించరాదని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. వలం దిశాను బాధితురాలిగానే చూపించాలని ఆయన సూచించారు.

Also Read:డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య: ఆ ముగ్గురూ పోకీరీలే, బైక్‌పై డేంజర్ సింబల్

Latest Videos

undefined

దేశవ్యాప్తంగా బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిర్భయ, అభయ పేర్లలా బాధిత వైద్యరాలి పేరును దిశాగా మార్చారు. ఈ విషయంపై ఆయన ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులతో చర్చించినట్లుగా తెలుస్తోంది. 

డాక్ట‌ర్ ప్రియంకా రెడ్డి హ‌త్య కేసు విచారణను వేగంగా చేపట్టి దోషులకు క‌ఠినంగా శిక్ష‌ప‌డేలా స్పెష‌ల్ కోర్టుని ఏర్పాటు చేయాలని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటుపై హైకోర్టుకు ప్ర‌తిపాద‌న‌లు పంప‌నున్న‌ట్లు ఆయన వెల్లడించారు

ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటైన వెంట‌నే రోజు వారీ పద్ద‌తిలో విచార‌ణ జ‌రిపి నిందితుల‌కు త్వ‌రిత‌గ‌తిన శిక్ష ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వ‌ల్ల బాధితులకు  సత్వర న్యాయం జరుగుతుందన్న ఆయన.. ప్రత్యేక కోర్టు ఏర్పాటుపై న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు.

డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయన్నారు.

శంషాబాద్‌లో జరిగిన ఘటన అమానుషమని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రియాంక కేసును త్వరితగతిన విచారించాలని, కేసును వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.

Also Read:కేసీఆర్ కొత్త పిట్టకథ : రామాయణం టు కలియుగం

రాత్రి వేళలలో మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయొద్దని ఆయన అధికారులను ఆదేశించారు. అదే సమయంలో మహిళా ఉద్యోగులు రాత్రి 8 గంటల లోపే విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని కేసీఆర్ సూచించారు

click me!