ఉద్యోగాల పేరుతో మోసం: హైద్రాబాద్‌లో ఫేక్ ఐపీఎస్ అధికారి రామ్ అరెస్ట్

By narsimha lodeFirst Published May 24, 2023, 10:36 AM IST
Highlights

హైద్రాబాద్ నగరంలో  నకిలీ  ఐపీఎస్ అధికారి రామ్ ను  సైబరాబాద్  పోలీసులు  ఇవాళ  అరెస్ట్  చేశారు.  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు  ఇతర  రాష్ట్రాల్లో  నిందితుడు మోసాలకు  పాల్పడినట్టుగా  పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్:  నకిలీ ఐపీఎస్  అధికారి   రామ్  ను  బుధవారంనాడు  సైబరాబాద్  పోలీసులు అరెస్ట్  చేశారు.  ఉద్యోగాలు, తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తామని  చెప్పి  నిందితుడు  పలువురిని మోసం  చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సెటిల్మెంట్ల కోసం ఫేక్ ఐపీఎస్ అధికారి  రామ్  హైద్రాబాద్ లో  ఏకంగా  ఆఫీస్ ను  ప్రారంభించారు.  హైద్రాబాద్ తో పాటు  పలు  రాష్ట్రాల్లో   ఫేక్ ఆఫీసర్ బాధితులున్నారని పోలీసులు గుర్తించారు.   ప్రత్యేక అధికారిగా  పోలీస్ విభాగంలో  విధులు నిర్వహిస్తున్నట్టుగా  రామ్  బాధితులను  నమ్మించాడు.  

ఫేక్ ఐపీఎస్ అధికారి  రామ్  హైద్రాబాద్ కు చెందిన మహిళను ట్రాప్  చేసిన విషయం పోలీసుల దర్యాప్తులో  వెలుగు చూసింది.  హైద్రాబాద్ లో  తాను ప్రారంభించిన  కార్యాలయంలోనే  ఫేక్ ఐపీఎస్ అధికారి రామ్  సెటిల్మెంట్లు  చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.  ఇదే  కార్యాలయంలో   విచారణ పేరుతో  కొందరిని  ఫేక్ ఐపీఎస్ అధికారి చిత్రహింసలకు  గురి చేసినట్టుగా  ఆరోపణలు ఉన్నాయి.  ఫేక్ ఐపీఎస్ అధికారి రామ్ ఎవరెవరి నుండి ఎంత మొత్తం డబ్బులు వసూలు చేశారనే విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

click me!