దేశంలో 16.80 కోట్ల వ్యక్తిగత డేటా చోరీ. 9 మంది అరెస్ట్: స్టీఫెన్ రవీంద్ర

By narsimha lode  |  First Published Mar 23, 2023, 3:14 PM IST


దేశంలో  16 కోట్ల మంది  వ్యక్తిగత  డేటా ను  చోరీ  చేసి  సైబర్ నేరగాళ్లకు   విక్రయిస్తుందని  సైబరాబాద్ సీపీ  స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.


 


హైదరాబాద్:  దేశంలోని  16 కోట్ల  80 లక్షల  మంది డేటాను   చోరీ చేసిన  తొమ్మిది మంది  సభ్యుల ముఠాను  సైబరాబాద్  సీపీ  స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గురువారంనాడు  సైబారాబాద్  సీపీ ష్టీఫెన్ రవీంద్ర తన కార్యాలయంలో  మీడియా సమావేశం  ఏర్పాటు  చేశారు.  దేశంలోనే అతిపెద్ద  డేటా  చోరీ  కేసుకు సంబంధించిన వివరాలను  సీపీ  స్టీఫెన్ రవీంద్ర మీడియాకు అందించారు.  

Latest Videos

వ్యక్తిగత డేటాను  సేకరించి  ఈ ముఠా విక్రయిస్తుందని సీపీ తెలిపారు.  డిఫెన్స్, ఆర్మీ  ఉద్యోగుల డేటాతో  పాటు  ఇతరుల  డేటాను  కూడా అమ్మకానికి పెట్టారని  సీపీ చెప్పారు. ఫేస్ బుక్  యూజర్ల  ఐడీ,  పాస్ వర్డ్ లను కూడా  ఈ ముఠా చోరీ చేసిందని సీపీ వివరించారు.  రుణాలు,  భీమా కోసం ధరఖాస్తు  చేసుకున్న వారి డేటాను  కూడా  ఈ ముఠా  చోరీ చేసిందని సీపీ తెలిపారు. ఐటీ ఉద్యోగుల  డేటా కూడా  చోరీకి  గురైందని  స్టీఫెన్ రవీంద్ర  తెలిపారు.  కీలక డేటాను  ఈ ముఠా  సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తుందని సీపీ  చెప్పారు.  

కీలక డేటాను  విక్రయించడం  దేశ భద్రతకు ముప్పు అని  స్టీఫెన్ రవీంద్ర  తెలిపారు.  మహిళల  వ్యక్తిగత  డేటా  కూడా  విక్రయించారని  స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నిందితుల్లో  క్రెడిట్  కార్డులు  జారీ  చేసే  ఎజేన్సీ  ఉద్యోగి అని  స్టీఫెన్ రవీంద్ర  వివరించారు. 

కీలకమైన బ్యాంకు  ఖాతాల సమాచారం  కూడా  నిందితులు  చోరీ  చేశారని  సైబరాబాద్  సీపీ తెలిపారు. ఈ డేటా లీక్  తో  జాతీయ భద్రతకు  ముప్పు వాటిల్లే  ప్రమాదం  పొంచి ఉందని  స్టీఫెన్ రవీంద్ర అభిప్రాయపడ్డారు.  ఈ ముఠాలో  సైబరాబాద్ పరిధిలో  ఆరుగురు,  నాగ్ పూర్, ముంబై, ఢిల్లీకి  చెందిన  ఒక్కొక్కరిని  అరెస్ట్  చేసినట్టుగా  సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. 

 ఆర్మీలో  పనిచేసే రెండున్నర లక్షల మంది డేటాను  నిందితులు  చోరీ చేశారని  సీపీ తెలిపారు.  దేశంలో  140  రంగాలకు  చెందిన  16 కోట్ల  80 లక్షల మంది  వ్యక్తిగత డేటాను  పోలీసులు చోరీ  చేశారని  స్టీఫెన్ రవీంద్ర వివరించారు.  ఆరు బ్యాంకులకు చెందిన కోటి పదిలక్షల మంది డేటా  చోరీకి గురైందన్నారు. ఇన్సూరెన్స్, లోన్స్ కోసం ధరఖాస్తు  చేసుకున్న 4 లక్షల మంది డేటాను నిందితులు చోరీ చేశారని  సీపీ తెలిపారు.  ఏడు లక్షల మంది ఫేస్ బుక్ యూజర్ ఐడీలు, పాస్ వర్డలు ు చోరీ చేశారన్నారు. ఢిల్లీలో 35 వేల ప్రభుత్వ ఉద్యోగుల డేటాను  నిందితులు  చోరీ చేశారని ఆయన వివరించారు.హై సెక్యూరిటీ బ్యాంకుల  నుండి  కూడా డేటా లీక్ అయిందని  సీపీ తెలిపారు.

click me!