ప్రాజెక్టులపై బోర్డులదే పెత్తనం: సుప్రీంకు వెళ్లే యోచనలో కేసీఆర్ సర్కార్

By narsimha lodeFirst Published Jul 16, 2021, 10:30 AM IST
Highlights

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం నాడు మధ్యాహ్నం జరగనుంది.ఈ సమావేశంలో  బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావడంపై చర్చించనున్నారు. ఈ విషయమై కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.
 


హైదరాబాద్: ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తీసుకు వస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. గురువారం నాడు అర్ధరాత్రి కృష్ణా, గోదావరి బోర్డుల్లోకి ఉమ్మడి ప్రాజెక్టులను తీసుకువస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది.  ఏకపక్షంగా గెజిట్ విడుదల చేయడంపై తెలంగాణ సర్కార్ ఆగ్రహంతో ఉంది. ఈ విషయమై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు నీటి పారుదల శాఖాధికారులు.

 

ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తీసుకు వస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. pic.twitter.com/xp9LYYpy2q

— Asianetnews Telugu (@AsianetNewsTL)

also read:ఏపీ, తెలంగాణ జలజగడానికి చెక్, గెజిట్ విడుదల: ప్రాజెక్టులపై పెత్తనమంతా బోర్డులదే

ఇవాళ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించనున్నారు. అంతేకాదు పార్లమెంట్ సమావేశాల్లో కూడ ఈ వషయమై  టీఆర్ఎస్ లేవనెత్తనుంది.  ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకుండానే బోర్డుల పరిధిలోకి  ప్రాజెక్టులను తీసుకురావడాన్ని తెలంగాణ తప్పుబడుతోంది.రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాలు పరస్పరం కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

click me!