ఐపీఎస్ అధికారి స్వాతిలక్రా పేరుతో డబ్బులకు డిమాండ్: కేసు నమోదు

By narsimha lodeFirst Published Sep 22, 2020, 10:36 AM IST
Highlights

సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతిలక్రా పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ  ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించి డబ్బులు పంపాలని కోరారు. ఈ విషయమై స్వాతి లక్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది.


హైదరాబాద్:  సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతిలక్రా పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ  ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించి డబ్బులు పంపాలని కోరారు. ఈ విషయమై స్వాతి లక్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నకిలీ ఫేస్ బుక్ ఐడీని సృష్టించి డబ్బులు పంపాలని స్వాతి లక్రా పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు  పోలీసులకు ,  స్నేహితులు, బంధువులకు రిక్వెస్ట్ పంపారు.  ఈ విషయాన్ని కొందరు స్వాతి లక్రా దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ విషయమై ఆమె తన అధికారిక సోషల్ మీడియాలో ఖాతాలో వివరణ ఇచ్చారు. తాను ఎవరిని కూడ డబ్బులు అడగలేదన్నారు. ఈ విషయమై స్వాతి లక్రా అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్న తర్వాత దుండగులు ఈ పోస్టును డిలీట్ చేశారు.  సుమారు 30 మందికిపైగా మోసగాళ్లు స్వాతి లక్రా పేరుతో డబ్బులు పంపాలని రిక్వెస్ట్ పంపిన విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు

ఈ విషయమై ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఒడిశా, రాజస్థాన్ నుండి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించామని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు.

click me!