హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం సీజ్: ఇద్దరు అరెస్ట్

Published : Aug 06, 2023, 09:31 AM ISTUpdated : Aug 06, 2023, 09:32 AM IST
హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో  భారీగా బంగారం సీజ్: ఇద్దరు అరెస్ట్

సారాంశం

హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో  ఇవాళ  కోటి రూపాయాల విలువైన  బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్  చేశారు.

హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో  1.88 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారంనాడు సీజ్  చేశారు.  జెడ్డా నుండి హైద్రాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుండి  కస్టమ్స్ అధికారులు  ఇవాళ  ఈ బంగారాన్ని సీజ్ చేశారు.  ఈ బంగారం విలువ కోటి రూపాయాలు  ఉంటుందని  అధికారులు అంచనా వేస్తున్నారు.

గతంలో కూడ శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని అధికారులు అరెస్ట్  చేశారు. ఈ ఏడాది జూలై  10న  రూ. 1.27  కోట్ల విలువైన  1.93 కిలోల బంగారాన్ని  అధికారులు సీజ్   చేశారు.  క్యాప్యూల్స్ రూపంలో  బంగారాన్ని తీసుకు వచ్చిన  ఇద్దరిని  అధికారులు అరెస్ట్  చేశారు. 

గత ఏడాది ఆగస్టు  14న  రూ. 13.63 లక్షల  విలువైన బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.  లోదుస్తుల్లో బంగారాన్ని  తరలిస్తుండగా  అధికారులు  ప్రయాణీకుడిని  అడ్డుకున్నారు.  గత ఏడాది  అక్టోబర్ 6వ తేదీన  శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏడు కిలోల బంగారాన్ని అధికారులు సీజ్  చేశారు. దీని విలువల రూ. 3.5 కోట్లుగా  ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

also read:శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.1.27 కోట్ల బంగారం సీజ్: ఇద్దరు అరెస్ట్

బంగారం అక్రమ తరలింపును అడ్డుకునేందుకు  అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే  అక్రమార్కులు కొత్త కొత్త మార్గంలో  బంగారాన్ని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ చీరకు  బంగారాన్ని స్ప్రే చేసి తీసుకు వచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు రెండు  రోజుల క్రితం  అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.ఈ చీరపై స్ప్రే చేసిన బంగారం విలువ రూ. 80 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు గుర్తించారు.


 
 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad Haunted House : నగర నడిబొడ్డున దెయ్యాల నివాసం.. కుందన్‌బాగ్‌ బంగ్లా అసలు కథ ఇదే..!
KTR First Reaction on Kavitha Party: కవిత పార్టీపై కేటీఆర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Asianet News Telugu