తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి కేటిఆర్ శాసనసభలో సెటైర్లు వేశారు. మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలు స్పందిస్తూ రేవంత్ రైడ్డిపై కూడా కేటిఆర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి కెటి రామారావు పరోక్షంగా సెటైర్లు వేశారు. చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా ఓ పిట్టకథ చెప్పారు. శనివారంనాడు శాసనసభలో లఘుచర్చ సందర్భంగా ఇది జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ ప్రగతి సాధించిందని కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యకు స్పందిస్తూ... గతంలో ఓ పెద్ద మనిషి ఇలాగే అన్నీ తానే చేశానని చెప్పుకునేవాడని కేటిఆర్ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
"అలాగే ఈ మధ్య ఆయన హైదరాబాదులోని ఎర్రగడ్డ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడున్న రోగులను పలకరించాడు. నేనెవరో తెలుసా అని ఓ రోగిని ప్రశ్నించాడు. తనకు తెలియదని అతను సమాధానమిచ్చాడు. దాంతో ఆ పెద్ద మనిషి నేను తెలియదా.. ఈ హైదరాబాద్ ను కట్టింది నేనే అని చెప్పాడు. దానికి పేషెంట్ స్పందిస్తూ అవునా విశాఖపట్నం పక్కన సముద్రాన్ని నేనే ఏర్పాటు చేశానని నేను చెప్పినా వినకుండా నన్ను ఇక్కడికి తెచ్చారు అని అన్నాడు. మీరు చెబుతున్నది కూడా అలాగే ఉంది" అని కేటిఆర్ అన్నారు.
గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో బాగా పనిచేసినవారున్నారని, మంచి ఉంటే మంచే చెబుతామని కేసిఆర్ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ తెచ్చారనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా శాసనసభలో చెప్పారని కేటిఆర్ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోయిందని అన్నారను. వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారని ఆయన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ండు నిర్వహణ టెండర్లలో అక్రమాలు జరిగాయని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేసిఆర్ సవాల్ చేశారు. ఆరోపణలు ఉన్న కంపెనీకి అతి తక్కువ ధరకు 30 ఏళ్లకు లీజుకు ఎలా ఇస్తారని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ కేటిఆర్ ఆ సవాల్ విసిరారు. పనిగట్టుకుని విషం చిమ్మే కొన్ని పత్రికల్లో వచ్చిందే వాస్తవమనుకుంటే ఎలా అని ఆయన భట్టలిని ప్రశ్నించారు.