ఏపీ, తెలంగాణ సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ భేటీ: విభజన సమస్యలపై చర్చలు

By narsimha lode  |  First Published Jan 12, 2022, 12:50 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల మద్య  నెలకొన్న విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి బుధవారం నాడు సమావేశమయ్యారు.  రెండు రాష్ట్రాలు తమ వాదలను విన్పించారు.


హైదరాబాద్:  Telugu రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై  రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు బుధవారం నాడు సమావేశమయ్యారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర హోంశాఖ చర్చించింది.రాష్ట్ర విభజన జరిగిన తర్వాతి నుండి రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్  సంస్థలపై చర్చించారు. 

రెండు రాష్ట్రాల మధ్య ఇప్ప‌టికీ అప‌రిషృతంగా ఉన్న ప‌లు అంశాల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఇటీవల  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఏపీ సీఎం Ys jagan  కోరారు.  Tirupati లో జ‌రిగిన స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశంలో అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్. Andhra prdesh, Telagana రాష్ట్రాల మధ్య తొమ్మిది,ప‌ది షెడ్యూల్ లోని సంస్థ‌ల విభ‌జ‌న సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఈ విషయమై ఇవాళ జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలు చర్చించాయి. ఆస్థులు,అప్పుల పంపిణీ,ఉద్యోగుల విభ‌జ‌న అంశాల‌ను చ‌ర్చించారు. తెలంగాణ రాష్ట్రం నుండి తమకు రావాల్సిన Electricity  బకాయిల గురించి కూడా ఏపీ ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఏపీ కి రావ‌ల్సిన ఆరు వేల కోట్ల విద్యుత్ బ‌కాయిలు రావాల్సి ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు. 

Latest Videos

విభ‌జ‌న చ‌ట్టం కింద ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన రెవెన్యూలోటు ఇంత‌వ‌ర‌కూ భ‌ర్తీ చేయ‌ని విషయాన్ని కూడా ఏపీ అధికారులు గుర్తు చేస్తున్నారు. వెనుక‌బ‌డిన జిల్లాల‌కు ఇస్తామ‌న్న నిధులు కేవ‌లం మూడేళ్లు మాత్ర‌మే ఇచ్చిన  విషయాన్ని కేంద్రం దృష్టికి ఏపీ అధికారులు తీసుకెళ్లారు. Polavaram ప్రాజెక్టుకు నిధులు విడుద‌ల చేయాలని కూడా ఏపీ సర్కార్ కోరింది. 

తెలంగాణ రాష్ట్రం కూడా తమ డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఇదే విషయమై గత ఏడాది చివర్లో కేంద్ర హోంశాఖ అధికారులు రెండు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించారు. 

రెండు రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల అవసరాల కోసం గోదావరి, కృష్ణా నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. రెండు రాష్ట్రాలు ఈ విషయమై పరస్పరం పిర్యాదులు చేసుకొన్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులనుత కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల పరిధిలోకి తీసుకు వచ్చేందుకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

ఈ సమావేశంలో తమ వాదనను సమర్ధవంతంగా విన్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సీఎస్ సోమేష్ కుమార్ సహా ఇతర అధికారులకు సూచించారు. మరో వైపు ఈ సమావేశానికి ముందే రాష్ట్రంలోని పలు శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ వరుస సమావేశాలు నిర్వహించారు.2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. అయితే విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు విభజన చట్టం ప్రకారంగా అప్పులు, ఆస్తులను విభజించారు. రాష్ట్రాలు విడిపోయి ఎనిమిదేళ్లు దాటినా కూడా కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. దీంతో ఈ సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంలు సమయం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.


 

click me!