హైదరాబాద్ ఎంఐఎం పార్టీకీ భారీ షాక్

First Published Dec 27, 2017, 2:45 PM IST
Highlights
  • మజ్లిస్ పార్టీకి ఎక్స్ కార్పొరేటర్ బిలాల్ రాజీనామా
  • కాంగ్రెస్ లో చేరతానని ప్రకటన
  • పాతబస్తీ నడిబొడ్డులో సెక్యులరిజం వినిపిస్తానని సవాల్

హైదరాబాద్ పాత బస్తీని కంచుకోటగా మలచుకుని ఏలుతున్న ఎంఐఎం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్ మజ్లిస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను వేలాది మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా బిలాల్ పార్టీ తీరుపట్ల గుర్రుగా ఉన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్నారు. పార్టీ తీరు నచ్చక ఆయన ఎంఐఎం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఐఎం పార్టీపై బిలాల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

హైదరాబాద్ పాతబస్తీలో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ దశాబ్దాల కాలంగా చక్రం తిప్పుతున్నది. ఆ పార్టీ చెప్పిందే పాతబస్తీలో చట్టం.. చేసిందే పాలన. ఆ పార్టీ అనేకంటే ఆ పార్టీ అగ్ర నేతలు అసదుద్దీన్ ఓవైసి, అక్బరుద్దీన్ ఓవైసి లదే హవా. వారే అక్కడ అన్నీ. పాతబస్తీని కనుచూపుతోనే వారు శాసించే స్థితి ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతున్నది. వారి చేతుల నుంచి పాతబస్తీ జారిపోతున్న వాతావరణం నెలకొంది. తాజాగా పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్ కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. మజ్లిస్ కు రాజీనామా చేశారు. దీంతో పాతబస్తీలోనే కాదు తెలంగాణ అంతటా ఈ పరిణామాలపై తీవ్ర చర్చనీయాంశమైంది.

ఎంఐఎం పార్టీ పాతబస్తీ ప్రజలకోసం కాకుండా కేవలం వివాదాలను పెంచిపోశించి బతకాలని చూస్తుందని బిలాల్ ఆరోపించారు. కానీ.. నేను పాతబస్తీ నడిబొడ్డున నిలబడి సెక్యులరిజం జిందాబాద్ అని నినదించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఎంఐఎం పార్టీని వీడుతున్నాను. భారతమాత విషయంలో ఎంఐఎం పార్టీ వివాదాన్ని రేకెత్తించడం పట్ల బిలాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మజస్లిస్ బ్రదర్స్ తీరు పట్ల ఓల్డ్ సిటీలో ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. సెక్యులరిజం పరిరక్షణ కోసమే తాను మజ్లిస్ పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. మజ్లీస్ పార్టీ మతాల పేరుతో ప్రజల మధ్య వైశమ్యాలు సృష్టిస్తూ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. మెట్రో రైలు ప్రాజెక్టు ఓల్డ్ సిటీలో రాకపోవడానికి ఎంఐఎం పార్టీనే కారణమన్నారు.

బిలాల్ మీడియాతో మాట్లాడిన ఫుల్ వీడియో కింద ఉంది. చూడగలరు.

click me!