గంట ముందే ప్రగతి భవన్ కు మంత్రులు, ఎందుకంటే?

Published : Sep 06, 2018, 10:46 AM ISTUpdated : Sep 09, 2018, 11:18 AM IST
గంట ముందే  ప్రగతి భవన్ కు మంత్రులు, ఎందుకంటే?

సారాంశం

మధ్యాహ్నం 12 గంటల వరకు  ప్రగతి భవన్ కు చేరుకోవాలని మంత్రులకు సీఎం కేసీఆర్ నుండి ఫోన్లు వచ్చాయని సమాచారం. మధ్యాహ్నం ఒంటి గంటకే  మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు  చేయాలని భావిస్తున్న తరుణంలోనే రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు గాను కేసీఆర్ ముందుగానే  మంత్రులను ప్రగతి భవన్ కు రావాలని  కోరినట్టు సమాచారం.

హైదరాబాద్: మధ్యాహ్నం 12 గంటల వరకు  ప్రగతి భవన్ కు చేరుకోవాలని మంత్రులకు సీఎం కేసీఆర్ నుండి ఫోన్లు వచ్చాయని సమాచారం. మధ్యాహ్నం ఒంటి గంటకే  మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు  చేయాలని భావిస్తున్న తరుణంలోనే రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు గాను కేసీఆర్ ముందుగానే  మంత్రులను ప్రగతి భవన్ కు రావాలని  కోరినట్టు సమాచారం.

అసెంబ్లీ రద్దుపై  తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్టు  సమాచారం. ఈ సమావేశం ముగిసిన  తర్వాత  గవర్నర్ తో  సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ రద్దు గురించే ఈ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం.

కేబినెట్ సమావేశానికి గంట ముందుగానే సీఎం కేసీఆర్  మంత్రులతో రాజకీయపరమైన విషయాలపై చర్చించే అవకాశం ఉంది.ఈ విషయాలపై చర్చించేందుకు గాను కేసీఆర్  గంట ముందుగానే  మంత్రులను ప్రగతి భవన్ కు రావాలని కోరినట్టు తెలుస్తోంది.

ఆదిలాబాద్ జిల్లాకు  చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కూడ సీఎం కేసీఆర్ ఫోన్లు చేసి పిలిపించారు.  ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చిన్నయ్య, రేఖానాయక్ , దివాకర్ రావు తదితరులు ఇప్పటికే సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. హుస్నాబాద్ సభ ఏర్పాట్లలో ఉన్న మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లు కూడ హైద్రాబాద్‌కు చేరుకొన్నారు. 

ఈ వార్తలు చదవండి

కోనాయిపల్లి: ఈ సారి కూడ ఆ సెంటిమెట్ కేసీఆర్‌కు కలిసొచ్చేనా?

 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌