టీఆర్ఎస్‌తో పొత్తు శాశ్వతం కాదు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

By narsimha lode  |  First Published Dec 1, 2022, 3:10 PM IST


టీఆర్ఎస్‌తో  పొత్తుపై సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు   చెప్పారు.  పాలేరులో  కూడా  ఎర్రజెండా  ఎగురవేస్తామన్నారు. 


హైదరాబాద్:  టీఆర్ఎస్‌తో  పొత్తు శాశ్వతం  కాదని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు  చెప్పారు.గురువారంనాడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  మీడియాతో  మాట్లాడారు. పాలేరులో  కూడా  గెలవడానికి  తాము ప్రయత్నిస్తామన్నారు.  కాంగ్రెస్  పార్టీ మునిగిపోయే నావ అన్నారు. అలాంటి  కాంగ్రెస్ పార్టీకి ఎందుకు  మద్దతివ్వాలని  ఆయన ప్రశ్నించారు.

మునుగోడు  ఉప ఎన్నిక సమయంలో  టీఆర్ఎస్‌కి   ఉభయ కమ్యూనిష్టు పార్టీలు మద్దతును ప్రకటించాయి.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో  లెఫ్ట్ పార్టీకి ఓటు బ్యాంకు ఉంది. దీంతో  ఈ  రెండు పార్టీలను తమకు మద్దతివ్వాలని టీఆర్ఎస్  కోరింది.  కాంగ్రెస్  పార్టీ కూడా సీపీఐ, సీపీఎంలను మునుగోడు ఉప ఎన్నికల్లో  మద్దతివ్వాలని  కోరింది.  కానీ లెఫ్ట్ పార్టీలు  కాంగ్రెస్  పార్టీకి కాకుండా  టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. టీఆర్ఎస్ కు తొలుత సీపీఐ  మద్దతును ప్రకటించింది. ఆ తర్వాత  సీపీఎం  కూడా  టీఆర్ఎస్ కు మద్దతును ప్రకటించింది.  

Latest Videos

2023లో  జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో  కూడా  లెఫ్ట్  పార్టీలతో  టీఆర్ఎస్  పొత్తు కొనసాగే  అవకశాలున్నాయని  ఇప్పటికే  మూడు  పార్టీల నేతలు సంకేతాలు  ఇచ్చారు.  దీంతో  వచ్చే ఎన్నికల్లో  ఏఏ స్థానాల్లో  పోటీ చేయాలనే విషయమై సీపీఐ, సీపీఎంలు  కసరత్తు చేస్తున్నారు. గతంలో తాము పోటీ చేసి విజయం సాధించిన స్థానాలపై  ఈ రెండు పార్టీలు  గురి పెట్టాయి. ఉమ్మడి  ఖమ్మం  జిల్లాలోని  పాలేరు అసెంబ్లీ స్థానంలో  గతంలో  సీపీఎం  విజయం సాధించింది.  అయితే  2014 తర్వాత  జరిగిన ఉప ఎన్నికల్లో  తుమ్మల  నాగేశ్వరరావు టీఆర్ఎస్  అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో  తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్  అభ్యర్ధి  కందాల ఉపేందర్ రెడ్డి  చేతిలో  ఓటమి పాలయ్యారు. వచ్చే  ఎన్నికల్లో  తుమ్మల నాగేశ్వరరావు  ఇదే స్థానం నుండి  పోటీకి  కసరత్తు  చేసుకుంటున్నారు. కానీ  ఈ స్థానంలో  ఎర్రజెండా  ఎగురవేస్తామని  ఇటీవలనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని  వీరభద్రం ప్రకటించారు తాజాగా  సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు  ప్రకటించడం  రాజకీయంగా  ప్రాధాన్యత సంతరించుకుంది.

click me!