ఖైరతాబాద్ సర్కిల్ వద్ద టెన్షన్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సహా పలువురి అరెస్ట్, ఉద్రిక్తత

By narsimha lode  |  First Published Dec 7, 2022, 11:27 AM IST

ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా  ఖైరతాబాద్ సర్కిల్ వద్ద సీపీఐ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. రాజ్ భవన్ వైపునకు వెళ్లకుండా పోలీసులు వారిని నిలువరించారు. 


హైదరాబాద్: ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో  భాగంగా  సీపీఐ   నేతలు బుధవారంనాడు ఉదయం ఖైరతాబాద్ సర్కిల్ కు చేరుకున్నారు. రాజ్ భవన్ వైపునకు సీపీఐ శ్రేణులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ నేతల  నిరసనతో  ఖైరతాబాద్ సర్కిల్ లో  ట్రాఫిక్ కు ఇబ్బంది నెలకొంది. ఖైరతాబాద్ సర్కిల్ వద్దే సీపీఐ నేతలు బైఠాయించారు.  పోలీసులకు, సీపీఐ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది.  రాజ్ భవన్  వైపునకు సీపీఐ శ్రేణులు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకొని అరెస్ట్  చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు, మాజీ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సహా పలువురు నేతలను అరెస్ట్  చేశారు.

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని  కోరుతూ  బుధవారంనాడు ఛల్ రాజ్ భవన్ కు సీపీఐ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నిరసనలో  భాగంగా  ఇవాళ   రాజ్ భవన్  వైపునకు వెళ్లే మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. రాజ్ భవన్ వైపునకు వచ్చే సీపీఐ నేతలను  పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు.

Latest Videos

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ గత కొంత కాలంగా డిమాండ్  చేస్తుంది.  తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడ సీపీఐ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.గవర్నర్ల ద్వారా రాష్ట్రాల్లో పాలనకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని  సీపీఐ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ, బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను కమ్యూనిష్టు పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. 

 తెలంగాణలో రాజ్ భవన్ ను ముట్టడిస్తామని గతంలోనే సీపీఐ నేతలు ప్రకటించారు.ఈ క్రమంలోనే  ఇవాళ  సీపీఐ నేతలు రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు.తెలంగాణ గవర్నర్ బీజేపీ నేత మాదిరిగా వ్యవహరిస్తున్నారని సీపీఐ నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్ భవన్ కు వెళ్లే సీపీఐ శ్రేణులను ఖైరతాబాద్ సర్కిల్ వద్ద పోలీసులు  సీపీఐ శ్రేణులను అరెస్టు చేశారు.
 

click me!