కేసీఆర్ కలిసిరావడం లేదు.. తెలంగాణలో మాక్కూడా సీట్లు కావాలి : సీపీఐ నారాయణ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 14, 2023, 06:02 PM IST
కేసీఆర్ కలిసిరావడం లేదు.. తెలంగాణలో మాక్కూడా సీట్లు కావాలి : సీపీఐ నారాయణ వ్యాఖ్యలు

సారాంశం

కన్నడిగులు బీజేపీకి దక్షిణ భారతదేశం గేట్లు మూసేశారని సీపీఐ నారాయణ అన్నారు. తెలంగాణలో పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మాక్కూడా కొన్ని సీట్లు కావాలని నారాయణ కోరారు. 

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తెలంగాణలో తమ పార్టీకి కొత్త ఆప్షన్ దొరికిందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో మోడీకి అవమానం జరిగిందని.. ఇంతగా దిగజారిన ప్రధానిని మళ్లీ రాడని చురకలంటించారు. లౌకికవాద దేశానికి ప్రధానిగా నరేంద్రమోడీ అనర్హుడని.. కర్ణాటక ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టారని ఆయన పేర్కొన్నారు. కన్నడిగులు బీజేపీకి దక్షిణ భారతదేశం గేట్లు మూసేశారని నారాయణ అన్నారు. తెలంగాణలో పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటక ప్రభావం తెలంగాణపైనా వుంటుందని నారాయణ తెలిపారు. కేసీఆర్ తమతో కలిసి రావడం లేదని ఆయన పేర్కొన్నారు. మాక్కూడా కొన్ని సీట్లు కావాలని నారాయణ కోరారు. 

కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కర్ణాటక ప్రజలను రంజింపజేయడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో.. అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని అన్నారు.  అదే సయంలో నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నట్టుగా కేటీఆర్ పేర్కొన్నారు. భారతదేశం గొప్ప మేలు కోసం పెట్టుబడులు,  మౌలిక సదుపాయాలను సృష్టించడం కోసం హైదరాబాద్, బెంగళూరు సిటీలను ఆరోగ్యకరంగా పోటీ పడనివ్వండని అన్నారు. 

Also REad: మోడీకి కేసీఆర్ పరోక్ష సహకారం.. బీజేపీని ఓడించమని కర్ణాటకలో ఒక్క సభ పెట్టారా , వాళ్లిద్దరూ ఒక్కటే : రేవంత్

ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ మార్క్‌ను అధిగమించి స్థానాలను సొంతం చేసుకుంది. కన్నడ ప్రజలు కూడా గత 38 ఏళ్లుగా కొనసాగుతున్న ఐదేళ్లకోకసారి అధికార మార్పిడి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. కాంగ్రెస్‌కు విజయం కట్టబెట్టారు
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే