
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావుపై సిపిఐ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రణయ్ హత్యకు అగ్రకుల దురహంకారమే కారణమని ఆయన అన్నారు.
మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రణయ్‌ను హత్య చేయించిన మారుతీరావును ఎన్‌కౌంటర్ చేయాలని అన్నారు. నయీం అనుచరులకు, టీఆర్‌ఎస్ నేతలకు సంబంధాలు బయటపడతాయని చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.
గత రెండ్రోజులుగా తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై కూడా ఆయన స్పందించారు. ప్రబోధానంద స్వామిని అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కలెక్టర్ లేదా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రభోదానందస్వామి ఆశ్రమాన్ని పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు.