
ఆదాయపన్ను శాఖ అధికారులు తన నివాసాలపై చేస్తున్న దాడులపై ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. అవి ఐటీ దాడులు కావని... ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే సాధారణ ఐటీ ప్రక్రియ మాత్రమేనని ఆయన తెలిపారు.. ప్రతి ఐదేళ్లకు .. అన్ని కంపెనీలను ఐటీ శాఖ తనిఖీ చేస్తుందన్నారు. ఇందులో దాడులు, సోదాలు అంటూ ఏమీ లేవని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఉదయం హైదరాబాద్ జూబ్లిహిల్స్‌తో పాటు ఖమ్మంలోని నివాసంతో పాటు పొంగులేటికి సంబంధించిన కనస్ట్రక్షన్స్, ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు