సిద్దిపేటలో గోవధ.. 8మంది అరెస్ట్... !

By AN TeluguFirst Published Feb 27, 2021, 9:39 AM IST
Highlights

సిద్దిపేటలో గోవధకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో సిద్దిపేట శివారు  సిరిసిల్ల వెళ్లే బైపాస్ రోడ్ లోని ఇటుక బట్టీల వెనుకున్న రేకుల షెడ్లులో ఆవులను వధిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

అప్పటికే అక్కడ వధించిబడిన ఆవులను పరిశీలించి, షెడ్డులో కట్టి వేసిన ఆవులను గోశాలకు పంచించారు. చనిపోయిన ఆవులకు వెటర్నరీ డాక్టర్ తో  పోస్టుమార్టం చేయించారు. 

ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న మహ్మద్ జుబేర్(45), మహ్మద్ ఖాజా (35), మహ్మద్ సద్దాం(30) మహ్మద్ అరఫత్ (24), మహ్మద్ ఇబ్రహీం(32), మహ్మద్ హర్షద్(25), మహ్మద్ ఆరాఫ్ (30), మహ్మద్ జావిద్ (30)లతో పాటు మరికొందరిని సిద్ధిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

గోవధ నిషేధం అని దీనికి బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అంతేకాదు సిద్దిపేట జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి పోలీసులు ఓ ముఖ్య గమనిక చేశారు. పుకార్లు నమ్మవద్దని, నేరస్థులు ఎంతటివారినైనా వదిలిపెట్టమని సిద్దిపేట జిల్లాలో ఎక్కడ ఎలాంటి శాంతిభద్రతల సమస్య రాకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.

ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే, పోలీసులకు సమాచారం అందించాలని, పోలీసులు వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని   సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. 

click me!