తెలంగాణ స్పీకర్ పోచారం సహా పలువురికి కోర్టు సమన్లు

By narsimha lodeFirst Published Feb 22, 2021, 5:44 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నేతలకు ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 4న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నేతలకు ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 4న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

2005లో జరిగిన ఆందోళన కార్యక్రమానికి సంబంధించి నమోదైన కేసును వరంగల్ కోర్టు నుండి ప్రజాప్రతినిధుల కోర్టుకు ఇటీవలనే బదిలీ అయింది.

ఈ కేసుపై సోమవారం నాడు ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ నిర్వహించింది.ఈ కేసులో అప్పటి టీడీపీ నేతలుగా ఉన్న ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి, మాజీ మంత్రులు వేణుగోపాలచారి, మండవ వెంకటేశ్వరరావులతో పాటు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిలను కోర్టు సమన్లు జారీ చేసింది.

మార్చి 4వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది కోర్టు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసును సత్వరమే విచారణ చేసేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు.

ప్రజాప్రతినిధులపై కేసులను త్వరితగతిన విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ కోర్టులో ఉన్న కేసు ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ అయింది.
 

click me!