దిగ్విజయ్‌‌సింగ్‌కి షాక్: నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ

By narsimha lodeFirst Published Feb 22, 2021, 4:43 PM IST
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ప్రజాప్రతినిధుల కోర్టు సోమవారం నాడు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.
 


హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ప్రజాప్రతినిధుల కోర్టు సోమవారం నాడు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

ఎంఐఎం నేత అన్వర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

2016లో ఎంఐఎంపై దిగ్విజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కోర్టు ఇవాళ విచారించింది. విచారణ సమయంలో కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ కోరారు. 

అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు. దిగ్విజయ్ సింగ్ అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. కోర్టుకు హాజరుకానందున ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది కోర్టు.

ఈ ఏడాది మార్చి 8వ తేదీకి ఈ కేసు విచారణను వాయిదా వేసింది కోర్టు.ఇతర రాష్ట్రాల్లో డబ్బు సంపాదనే లక్ష్యంగా ఎంఐఎం ఎన్నికల్లో పోటీ చేస్తోందని  దిగ్విజయ్ సింగ్ చేసిన విమర్శలపై ఎంఐఎం నేత పరువు నష్టం దావా దాఖలు చేశారు.

click me!