కార్వీలో అక్రమాలు.. జనానికి మొత్తం రూ.780 కోట్ల కుచ్చుటోపీ, మరోసారి సీసీఎస్ కస్టడీకి పార్థసారథి

Siva Kodati |  
Published : Aug 28, 2021, 05:32 PM IST
కార్వీలో అక్రమాలు.. జనానికి మొత్తం రూ.780 కోట్ల కుచ్చుటోపీ, మరోసారి సీసీఎస్ కస్టడీకి పార్థసారథి

సారాంశం

పార్థసారథిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్ట్. దీంతో మరోసారి ఆయనను విచారించనున్నారు సీసీఎస్ పోలీసులు . అయితే ఖాతాదారులకు సెబీతో పాటు తన ఆస్తులను అమ్మీ న్యాయం చేస్తానంటున్నారు పార్థసారథి. దీంతో ఆయనను టీటీ వారెంట్‌పై తీసుకెళ్లేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

కార్వీ కన్సల్టెన్సీ  అక్రమాలను నిగ్గుతేల్చారు సీసీఎస్ పోలీసులు. రూ.780 కోట్లు ఖాతాదారుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టినట్లు నిర్ధారించారు. రూ.720 కోట్ల షేర్లను తనఖా పెట్టి రుణం పొందినట్లు విచారణలో వెల్లడైంది. రూ.1200 కోట్లు బ్యాంకులకు రుణం ఎగవేశారు. కార్వీ చీటింగ్ మొత్తం రూ.207 కోట్లుగా తేల్చారు పోలీసులు. కార్వీ ఆస్తుల మొత్తాన్ని బ్యాంకుల్లో కుదువపెట్టారు పార్థసారథి. రూ.13 కోట్ల లిక్విడ్ క్యాష్‌ను గుర్తించారు.

Also Read:కార్వీ స్కాంపై సీసీఎస్ దూకుడు:నిధుల మళ్లింపు, హవాలాపై సమగ్ర దర్యాప్తు కోరుతూ ఈడీకి లేఖ

పార్థసారథి రెండు రోజుల పోలీస్ కస్టడీలో పూర్తి ఆధారాలు సేకరించారు. రూ.780 కోట్లను కొనుగోలు చేశారు పార్థసారథి. షేర్లలో పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు చెబుతున్నారు. ఖాతాదారులకు సెబీతో పాటు తన ఆస్తులను అమ్మీ న్యాయం చేస్తానంటున్నారు పార్థసారథి. దీంతో ఆయనను టీటీ వారెంట్‌పై తీసుకెళ్లేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు  పార్థసారథిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్ట్. మరోసారి పార్థసారథిని విచారించనున్నారు సీసీఎస్ పోలీసులు . 

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu