
హైదరాబాద్: నాగర్‌కర్నూల్ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి ఓ సతీమణి భర్తను హతమార్చారు. విషయం మూడో మనిషికి తెలియకుండా మృతదేహాన్ని గుట్టుగా నల్లమల అడవిలో పారేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో ఘటన చోటుచేసుకుంది. నల్లమల అడవిలోని దర్గా దగ్గర మృతదేహం లభించింది.
తాజాగా పోలీసులు ఆ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం అస్థిపంజరంగా మారిపోయింది. ఆ అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేషగూడెం గ్రామానికి చెందిన మాణిక్యరావుగా గుర్తించారు.