అమ్నేషియా పబ్ కేసులో కీలక మలుపు: ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్ట్

Siva Kodati |  
Published : Jun 10, 2022, 09:52 PM ISTUpdated : Jun 10, 2022, 09:58 PM IST
అమ్నేషియా పబ్ కేసులో కీలక మలుపు: ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్ట్

సారాంశం

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుతో పాటు మరో మైనర్‌ను న్యాయస్థానం పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో ఇద్దరిని ఐదు రోజుల పాటు విచారించనున్నారు పోలీసులు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ అత్యాచారం కేసు (amnesia pub rape case)  కీలక మలుపు తిరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుతో పాటు మరో మైనర్‌ను న్యాయస్థానం పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో ఇద్దరిని ఐదు రోజుల పాటు విచారించనున్నారు పోలీసులు. రేపటి నుంచి ఆరుగురిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించనున్నారు పోలీసులు. 

ఇకపోతే.. బాలికతో నిందితులు అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. 

మరోవైపు ఈ కేసులో పోలీసుల విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారమే కాకుండా నిందితులు బాలికపై విచక్షణారహితంగా దాడి చేసినట్లుగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ క్రమంలోనే బాలిక మెడపై తీవ్రగాయాలు చేశారు నిందితులు. అలాగే బాలిక శరీరంపైనా గాయాలను గుర్తించారు తల్లిదండ్రులు. ఇన్నోవా కారులో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాలిక ప్రతిఘటించడంతో గోళ్లతో దాడి చేశారు నిందితులు. ఈ నేపథ్యంలో బాలిక ఒంటిపై 12 గాయాలను గుర్తించారు వైద్యులు. 

కాగా..కేసులో ఏ-1గా ఉన్న Saduddin Malikను చంచల్గూడ జైలు నుంచి Police custodyలోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని పోలీసులు గతంలో కోరిన సంగతి తెలిసిందే.  దీంతో నేటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు కస్టడీకి కోర్టు అనుమతించింది. సాదుద్దీన్ మాలిక్ ను ప్రశ్నిస్తే మరికొన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్న పోలీసులు.. అత్యాచార ఘటనను Sean Reconstruction చేయనున్నారు. పబ్లో బాలికను డ్రాప్ చేసిన అంశాల పైనా విచారించారు.

ఇకపోతే.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితులు ఉపయోగించిన..  Innova car విషయంలో స్పష్టత రాలేదు. దీని యాజమానులు ఎవరు? రిజిస్ట్రేషన్ స్థితిపై స్పష్టత లేకపోవడం అంశాలు..  రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక Registration నంబర్లతో తిరుగుతున్న వాహనాలు, రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న వాహనాలు..  రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా అనేక వాహనాలు తిరుగుతున్నాయన్న విషయం వెలుగులోకి వచ్చింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu