వనస్థలిపురంలో దారుణం.. డబ్బు ఆశతో కన్నపేగునే అమ్ముకున్నారు..

Published : Feb 08, 2022, 07:24 AM IST
వనస్థలిపురంలో దారుణం.. డబ్బు ఆశతో కన్నపేగునే అమ్ముకున్నారు..

సారాంశం

డబ్బు ఆశ వారిని విచక్షణ మరిచేలా చేసింది. పుట్టింది ఆడపిల్ల అవ్వడం వారికి మరింతగా డబ్బుకోసం ఆశపడేలా చేసింది. అంతే కేవలం రూ.80వేలకోసం కన్నపేగును అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. చివరికి చిన్నారి అమ్మమ్మ ఫిర్యాదులో విషయం వెలుగులోకి రావడంతో..

వనస్థలిపురం : మానవత్వం మంట కలిసేలా.. సభ్యసమాజం సిగ్గుపడేలా.. moneyకు ఆశపడి ఓ దంపతులు కన్నపేగును అంగట్లో బేరం పెట్టిన ఘటన Vanasthalipuram ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. అమ్మమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులుnew born baby girlను విక్రయించిన coupleతో పాటు కొనుగోలు చేసిన మహిళ, సహకరించిన 
Asha activistను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురంలోని కమలానగర్ కు చెందిన దంపతులు దుర్గ ప్రియ, శ్రీనివాస్ వాచ్మెన్ గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. జనవరి 21న గాంధీ ఆసుపత్రిలో మూడో కాన్పులో ఆడ శిశువు జన్మించింది. మూడు రోజుల తర్వాత వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయడంతో దుర్గాప్రియ తల్లి రాజేశ్వరి వారిని ఇంటి వద్ద దింపేసి తన స్వగ్రామమైన కర్నూలు జిల్లా ఆలూరుకి వెళ్ళిపోయింది.

ఇంటికి వెళ్ళిన తర్వాత కూతురు, అల్లుడు ఫోన్ చేయడం లేదని ఈనెల 6న ఆమె తిరిగి వనస్థలిపురంకి చేరుకుంది. ఇంట్లో నవజాతశిశువు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలానగర్ కు చెందిన కవిత అనే మహిళ సోదరి ధనమ్మకు సంతానం లేదు.  నవజాత శిశువు కోసం ఆమె ఆశ కార్యకర్త భాషమ్మను సంప్రదించింది. ఆమె ఈ విషయాన్ని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దుర్గాప్రియ దంపతులకు చెప్పింది.

డబ్బు కోసం ఆశపడిన ఆ దంపతులు రూ.80వేలకు శిశువును విక్రయించారు. నిందితులు దుర్గాప్రియ, శ్రీనివాస్ తో పాటు ధనమ్మ, భాషమ్మపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. శిశువును చైల్డ్లైన్ సంస్థకు అప్పగించారు. 

ఇదిలా ఉండగా, నిరుడు మేలో ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. కారు మీది మోజుతో కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టారో దంపతులు. అప్పుడు కూడా అమ్మమ్మ తాతయ్యల చొరవతోనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కన్నబిడ్డలకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలనుకుంటారు తల్లిదండ్రులు. తాము పస్తులు వుండైనా సరే బిడ్డల ఆకలి తీర్చే వారు ఎందరో. కానీ కారు కొనాలనే ఆశతో ఏకంగా పురిట్లోని బిడ్డనే అమ్మకానికి పెట్టారు ఓ కసాయి తల్లిదండ్రులు. 

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ జిల్లా తిర్వా కొట్వాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సతౌర్‌కి చెందిన ఓ మహిళ మూడు నెలల క్రితం మగ శిశువుకి జన్మనిచ్చింది. అయితే, వీరికి కారు కొనాలని ఆశ. అయితే అందుకు తగిన ఆర్ధిక స్తోమత వారి వద్ద లేదు.దీంతో గురుసాహైగంజ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను కలిసి బిడ్డను రూ.1.5 లక్షలకు విక్రయించారు. 

ఆ పసికందు అమ్మమ్మ, తాతయ్య గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. బిడ్డ అప్పటికీ వ్యాపారి వద్దే ఉన్నాడని పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును అమ్మకానికి పెట్టిన ఆ దంపతులను విచారణ కోసం పిలిచారు. తాము వ్యాపారి ఇచ్చిన డబ్బుతో ఇటీవలే పాత కారును కొనుగోలు చేశామని దంపతులు అంగీకరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!