పని ఇస్తామని పిలిచి హత్య.. ఒంటిపై బంగారం తీసుకొని..

By telugu teamFirst Published Nov 21, 2019, 9:01 AM IST
Highlights

 గతంలో  రెండు మూడు సార్లు మార్బుల్‌ షాపుల్లో పని నిమిత్తం నాగోలు ప్రాంతానికి తీసుకువచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం వివాహేతర సంబంధానికి దారి తీసింది. జల్సాలకు అలవాటు పడిన రమేష్‌ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 
 

కూలి పని ఇస్తామని పిలిచి ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారం కోసమే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా... నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హయత్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా, యారరం గ్రామానికి చెందిన  చెట్ల లింగమ్మ(50) నగరానికి వలసవచ్చి సోమాజిగుడలో ఉంటూ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కందూరి రమేష్, తన భార్య సుజాతతో కలిసి ఖైరతాబాద్‌ బీజేఆర్‌లో ఉంటూ నాగోలులోని మార్బుల్స్, టైల్స్‌ షాపుల్లో కూలి పని చేసేవాడు.

అతడి భార్య సుజాత పంజగుట్టలోని ఓ ఆసుపత్రిలో స్వీపర్‌గా పని చేసేది. మక్తాలోని లేబర్‌ అడ్డాలో లింగమ్మతో రమేష్‌కు పరిచయం ఏర్పడటంతో గతంలో  రెండు మూడు సార్లు మార్బుల్‌ షాపుల్లో పని నిమిత్తం నాగోలు ప్రాంతానికి తీసుకువచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం వివాహేతర సంబంధానికి దారి తీసింది. జల్సాలకు అలవాటు పడిన రమేష్‌ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 

దీనికితోడు రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి కన్ను లింగమ్మ ఒంటిపై ఉన్న నగలపై పడింది. అమెను హత్య చేసి వాటిని సొంతం చేసుకోవాలని భావించిన రమేష్‌ అందుకు అదును కోసం ఎదురు చూస్తున్నాడు. 

భార్యతో కలిసి పథకం పన్నాడు. ఆమెకు పనికలిపిస్తామని నమ్మించాడు. పథకం ప్రకారం ఆమెను తీసుకువెళ్లి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఆమె మెడలోని బంగారు నగలు, ఆమె కాళ్లకు ఉన్న కడియాలను భార్య సహాయంతో కాజేశాడు. వాటిని తీసుకువెళ్లి బంగారు దుకాణంలో తాకట్టుపెట్టి డబ్బు తీసుకున్నాడు.

కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమేరాల ఆధారంగా పరిశీలించగా.. రమేష్ పై అనుమానం కలిగింది. అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయట పడింది. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!