అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట ఐటీ సోదాలు

Published : Nov 21, 2019, 07:53 AM IST
అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట ఐటీ సోదాలు

సారాంశం

 14 బృందాలకు చెందిన ఐటీ అధికారులు.. వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. వార్షిక తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్లుగా తెలుస్తోంది

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు ఇంట్లో ఐటీ అధికారులు  సోదాలు చేపట్టారు. కృష్ణారావు కొడుకు సందీప్‌రావుకు చెందిన.. ప్రణీత్‌ హోమ్స్‌ కార్యాలయంతో పాటు డైరెక్టర్ల ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు సినీ రంగానికి చెందిన ఇళ్లపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

14 బృందాలకు చెందిన ఐటీ అధికారులు.. వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. వార్షిక తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. కాగా... ఓ అధికార పార్టీ నేత ఇంట్లో సోదాలు నిర్వహించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.  

ఇదిలా ఉండగా... బుధవారం పలురురు సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా దాడులు జరగడం గమనార్హం. రామానాయుడు స్టూడియో, వెంకటేష్, నానిలకు సంబంధించిన కార్యాయాలు, ఇళ్లల్లోకూడా సోదాలు నిర్వహించారు. ఈ దాడులు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్