హైదరాబాదులో వర్ష బీభత్సం: టోల్ గేట్ షెడ్డు కూలి దంపతుల మృతి

By telugu teamFirst Published May 16, 2020, 3:42 PM IST
Highlights

హైదరాబాదులో శనివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో పడిన వర్షం వల్ల చెట్లు విరిగిపడ్డాయి. టోల్ గేట్ వద్ద షెడ్డు కూలి దంపతులు మృత్యువాత పడ్డారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాదులో ఈదురు గాలులతో కూడా భారీ వర్షం కురిసింది. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూరు వద్ద టోల్ గేట్ షెడ్డు కూలి దంపతులు మరణించారు. మృతులను కృష్ణయ్య, పుష్పలుగా గుర్తించారు. గాలికి టోల్ గేటుకు వేసిన రేకులు ఎగిరిపడ్డాయి.

హైదరాబాదులో కుండపోత వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడం వల్ల పలు చోట్ల రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి. ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ జలదిగంబంధమైంది. కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది.

హైదరాబాదులోని ప్రధాన రహదారులన్నీ జలమయ్యాయి. రోడ్లపై మనుషులు లేకపోవడంతో చాలా వరకు ప్రమాదాలు తప్పాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, నాంపల్లి, ఆబిడ్స్ వంటి పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. 

వర్షం కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రోడ్లపై విరిగి పడిన చెట్లను జిహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో కారుపై చెట్టు విరిగిపడింది.

click me!