
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం దేవరంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మూడు నెలల పాపను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాలతోనే వారు ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మృతులను అశోక్, సంధ్య, అంకితలు గుర్తించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.