
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది . సదాశివపేట మండలం కోల్కూర్‌లో మంత్రాలు చేస్తున్నారనే నెపంతో దంపతులు గ్రామమంతా ఏకమై చెట్టుకు కట్టేసి చితకబాదారు. గ్రామానికి చెందని యాదయ్య, శ్యామల దంపతులు చేతబడి చేస్తున్నారంటూ ఓ మంత్రగాడు చెప్పాడు. దీంతో అతని మాటలను నిజమని నమ్మిన గ్రామస్తులు వారిద్దరిని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. అంతేకాదు.. ఈ విషయం ఎవరికైనా చెబితే గ్రామం నుంచి వెలివేస్తామని దంపతులను వూరి పెద్దలు హెచ్చరించారు. అయితే వీరి బారి నుంచి ఒక వ్యక్తి తప్పించుకుని విషయం పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.