ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో వున్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం జూన్ 2కు వాయిదా వేసింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో వున్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం జూన్ 2కు వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక అనివార్యమైంది.
కాంగ్రెస్ పార్టీ తరపున మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, సుదర్శన్ గౌడ్ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలిచారు. గత గురువారం ఈ స్థానంలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎక్స్అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌ను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్‌కి తరలించారు.